రాష్ట్ర ఖజానాపై అప్ప్పులపై భారం ` కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి గత 26 నెలýలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్ప్పులు, చెల్లింపులు, వాటి వినియోగాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలక ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ విస్మరించి పక్కదారి పడుతున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీలెన్ని మారినప్పటికీ అప్ప్పుల కుంపటి నానాటికీ పెరుగుతుందేగానీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి మంగళవారం అందినకాడికి అప్ప్పులు చేస్తూ, అప్ప్పులవారంగా మార్చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు అప్ప్పులు రికార్డు స్థాయికి చేరాయి. గత 26 మాసాల్లో రాష్ట్ర అప్ప్పులు రూ.3,86,348 కోట్లు అప్ప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులకు కూటమి సర్కార్ పదేపదే గ్యారంటీలు ఇస్తూ జీవోలు జారీ చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమవుతూ, అప్ప్పులు మాత్రం అర్రులు చాస్తున్నారు.
గత మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.2,600 కోట్ల అప్పులు చేశారు. దీంతో గత 26 నెలల్లోనే చంద్రబాబు సర్కారు చేసిన బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.3,86,348 కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి నెలకు సరాసరి రూ.11 వేల కోట్లకుపైగా బడ్జెట్ అప్పులు చేయగా, గత 5 నెలల కాలంలో ఎపీ అప్ప్పు మొత్తం రూ.55,534 కోట్లు కావడం ఆందోళనకరం. నెలవారీగా పన్ను రాబడిని మించి, కూటమి ప్రభుత్వం అప్పులు చేయడంతో వడ్డీల చెల్లింపులతో రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతోంది. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలయ్యే పరిస్థితి దాపురించింది.
కూటమి ప్రభుత్వం మరోపక్క కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేటు శక్తులకు ధారాదత్తం చేస్తోంది. ప్రభుత్వ, ప్రజా ఆస్తుల ద్వారా ప్రభుత్వ ఆధీనంలోనే ఆదాయ మార్గాలు అన్వేషించకుండా, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా కారుచౌకగా అప్పగించేందుకు పావులు కదపడం దుర్మార్గం. తెచ్చిన అప్ప్పులను ఆదాయం సమకూరే రంగాలపై వెచ్చించకుండా, అనవసరపు ఆర్భాటపు ఖర్చులు అధికంగా చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల నెత్తిపై మరిన్ని అప్ప్పుల భారాలను మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్ప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు, నిధుల వినియోగం తదితరాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *