విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటామని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రతి అక్కాచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ కట్టడం ద్వారా సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం మరింత బలపడతాయని అన్నారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆనందం, ఆరోగ్యం, శాంతి వెల్లివిరియాలని, అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే చిరస్థాయిగా కొనసాగాలని దేవినేని అవినాష్ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News