విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో డా. ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మరియు డా. అచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో కాయచికిత్స విభాగం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గురువారం నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 1,500 మంది ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు, మందులు మరియు ఆయుర్వేద వైద్య సలహాలు అందించారు. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం, దగ్గు, జలుబు, ఆస్తమా తదితర దీర్ఘకాలిక మరియు జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలకు వైద్యులు సేవలందించారు. ఈ శిబిరంలో ఎపిఎసఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడి), డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, డా. కె.శ్రీనివాస్, ఎండి (ఎవై), పిజి స్కాలర్స్ మరియు ఆయుర్వేద వైద్య సిబ్బంది పాల్గొని వైద్య సేవలు అందించారు. ప్రజలకు ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పిస్తూ, అందరికీ సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఉచిత వైద్య సేవలను అందించడం ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు శిబిరానికి హాజరై వైద్యసేవలను పొందడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా. టి.బుల్లయ్య, సూపరింటెండెంట్ పి.జగదీశ్ హర్షం వ్యక్తం చేశారు. శిబిరాన్ని విజయవంతం చేసిన ఎపిఎసఆర్‌టిసి అధికారులు, వైద్యులు, పిజి స్కాలర్స్, సిబ్బంది మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *