విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఇరుముడి చిత్రంలో పాఠశాల విద్య లో ప్రభుత్వ పాఠశాల ను కించ పరిచే విధంగా ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల బోర్డు ను, ప్రస్తుతం ప్రభుత్వంచే సప్లయ్ చేయబడిన పాఠశాల యూనిఫాంను, ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలిని తప్పుడు గా చూపించడం జరిగింది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్య ను కించ పరిచే విధంగా ఉందని ఈ దృశ్యాలను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయం లో చర్యలు తీసుకోవాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు, (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం జి మెహది డిమాండ్ చేశారు. తల్లి, తండ్రి తర్వాత ఉపాధ్యాయుని గౌరవించే మన సమాజం లో ఉపాధ్యాయ వృత్తిని కించ పరిచే విధంగా చిత్రీకరించడం దారుణం. వాణిజ్య పరంగా ఆలోచించి విద్యా శాఖ కు మచ్చ తెచ్చే విధంగా చిత్రీకరించిన చిత్ర దర్శకుడు ఒక ప్రకటన లో నేను ఉపాధ్యాయుడిగా పని చేశాను అని చెప్పి,ఈ విధంగా ఒక టీచరు క్యారెక్టర్ ను ఇంత దారుణంగా ఎలా తీయగలిగారు అని వారు ప్రశ్నించారు. ఈ విషయం పై వ్రాత పూర్వకంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి మరియు పాఠశాల విద్యా శాఖ అధికారులకు లేఖ రాయడం జరిగిందని వారు తెలియచేశారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులను కించ పరిచడం అంటే విద్యా శాఖ ను శాఖను కించపరిచునట్లు విద్యా శాఖ అధికారులు గ్రహించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆప్టా సంఘ నాయకులు కోరారు.
Tags vijayawada
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News