విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
62వ డివిజన్ సుందరయ్య నగర్ విశ్వమాత మరకత వాసవి దేవస్థానం 5వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, శివ స్వామి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రాఖీ కడుతున్నట్లుగా దేవస్థానం నిర్వాహకులు ప్రత్యేక అలంకరణను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొని స్వామివారి, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం నిర్వాహకులు ఘనంగా ప్రసాదం పంపిణీ చేసి భక్తులకు అందించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం గౌరవ అధ్యక్షులు గార్లపాడు సుదర్శన్, పైడిమర్రి రామారావు, అధ్యక్షులు శిఖకొల్లి జటాధర్, సెక్రటరీ ముప్పిడి భాస్కర్, కోశాధికారి వేముల సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు చెక్క చెన సుబ్బారావు, కోళ్ల హనుమంతరావు, చీమకుర్తి శ్రీనివాసు, నంబూరు శీను, వనమా అరవింద్, పందిరి బాలసుబ్రహ్మణ్యం, దేశ మురళి, ముప్పిడి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్వమాత మరకత వాసవి దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
Prajavartha Online Telugu News