ధరణి దుర్గా దేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

-శాంతినగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలు.. భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
61వ డివిజన్ శాంతినగర్‌లో శుక్రవారం నిర్వహించిన ధరణి దుర్గా దేవి అమ్మవారి పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం  పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భక్తులకు స్వయంగా అన్నం వడ్డించి భక్తులతో ఆప్యాయంగా మమేకమయ్యారు, ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఎమ్మెల్యే గారిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు, ధరణి దుర్గా దేవి అమ్మవారి ఆలయానికి అవసరమైన స్టీల్ గ్రిల్స్ ఏర్పాటుకు రూ.1.35 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించడంతో పాటు భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అన్నసంతర్పణలో స్వయంగా వడ్డించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా బోండా ఉమామహేశ్వరరావు తమకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని స్థానికులు ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే ని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు, టీడీపీ శ్రేణులు, భక్తులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *