విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్)లో చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్లోని ఏడుగురు జిల్లా కలెక్టర్లు గవర్నర్ గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. సెప్టెంబర్ 1న ఉదయం 11 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఐఆర్సీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ పతకాలను ప్రదానం చేయనున్నారు.
గోల్డ్ మెడల్స్ స్వీకరించేందుకు ఏడుగురు కలెక్టర్లు వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పతకాలు అందుకోనున్న వారిలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చాడలవాడ నాగరాణి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఉన్నారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి అందిన సమాచారాన్ని అనుసరించి ఈ అనుమతులు జారీ చేశారు. కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యే సమయంలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అదనపు జిల్లా మేజిస్ట్రేట్లు కలెక్టర్ల ప్రస్తుత విధులను నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Tags vijayawada
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News