శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం

గుంటూర, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్తాయిలో నిషేధించుట జరిగిందని, వ్యాపారస్తులు ఎవరైనా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించినట్లైతే అటువంటి వారికి అపరాధ రుసుము విధించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ శానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం ఉన్నందున ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత అవగాహన కలిగించాలన్నారు. వ్యాపారస్తులు, దుకాణదారులు, రిటైల్ వ్యాపారులు, వీధి వ్యాపారులు లేదా ప్రజలుఎవరైనా నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వార్డు స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, వ్యాపార సముదాయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, సైడు కాలువలను ప్రతి రోజు శుభ్రం చేయించి, డ్రైన్లలో తొలగించిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. ముఖ్యంగా గార్బేజ్ పాయింట్లు లేకుండా చూడాలని, రోడ్ల పై గార్బేజ్ పాయింట్లు ఉన్నట్లయితే వెంటనే వాటిని తొలగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. అలాగే నగరంలో బల్క్ వేస్ట్ జనరేటర్స్ ని గుర్తించి, వ్యర్ధాలను వారి వద్దనే ప్రాససింగ్ చేసేలా వారికి అవగాహనా కలిగించాలన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ఖాళీ స్థలాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ఎంఎల్ఓ ఆయిల్, ఎబైల్ లను స్ప్రే చేయించాలని బయాలజిస్ట్ ని ఆదేశించారు. ముఖ్యంగా నగరంలోని ఖాళీ స్తలాల యజమానులను గుర్తించి, వారి స్తలాలను శుభ్రం చేయించుకోనేలా అవగాహన కలిగించాలని, ప్రజలు ఎక్కువగా ఇబ్బందిపడే స్తలాలను ముందుగా శుభ్రం చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి పూర్తి స్థాయిలో వాహనాలు, కార్మికులను కేటాయించామన్నారు. నగరంలో ప్రధాన రహదారుల్లో ప్రజలు వారి ఆవులను యధేచ్చగా వదిలేస్తున్నారని, వాటి వలన నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువౌతున్నాయని, వాటిని పట్టుకొని నగర పాలక సంస్థ బందెల దొడ్డికి తరలించాలన్నారు.
సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ , ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, బయాలజిస్ట్ శేషయ్య, వెటర్నరీ డాక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *