దేశ భాషల్లో తెలుగు భాషకు మించిన భాషే లేదు… : ప్రిన్సిపాల్ గంగాధర్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ భాషల్లో తెలుగు భాషకు మించిన భాషే లేదని సెయింట్ జేవియర్ ప్రిన్సిపాల్ గంగాధర్ అన్నారు. అన్నారు. స్కూల్ నందు మాతృభాష తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం విద్యార్థినీవిద్యార్థుతో శ్రీకష్ణదేవరాయల భువన విజయంపై నాటిక ప్రదర్శన చేయించారు. విద్యార్థులు తెలుగు భాష గొప్పదనాన్ని తెలి యచేసే వేషధారణతో పాటు ప్రజలను, సమాజాన్ని ఆనాటి సంప్రదాయాలను ఉట్టిపడేలా అద్భుతంగా విద్యార్థులు నాటికను ప్రదర్శించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. నాటిక ప్రదర్శనను తిలకించిన విద్యార్దులు తల్లిదండ్రులు ఎంతో ఆనందించి, విద్యార్థులను అభి నందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గంగాధర్ మాట్లాడుతూ తెలుగుభాష గొప్పతనం చిన్ననాటి నుంచే విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మాతృభాషకు ప్రతి ఒక్కరూ పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, దుర్గారావు, రతన్ కుమార్, కరిములేషన్, దుర్గాదేవి, సావిత్రి దేవి, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *