మాతృ భాషను గౌరవిద్దాం తెలుగు భాషను అభివృద్ధి చేద్దాం…

-గిడుగు వెంకట నాగేశ్వరరావు గిడుగు రామమూర్తి పంతులు ముది మనవడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్ లోని ఠాగూర్ గ్రంథాలయంలో ఈరోజు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి వేడుకలు తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడెను. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గిడుగు రామమూర్తి పంతులు ముది మనవడు గిడుగు వెంకట నాగేశ్వరరావు మరియు మనుమరాలు గిడుగు సరస్వతి విచ్చేసి ముందుగా గిడుగు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవహారిక బాషోద్యమ నిర్మాత గీడుగు అని ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు ఈ కవులు రచయితలు చివరకు శ్రీశ్రీ కూడా ఆ వ్యవహారిక భాషని ఉపయోగించి న ఘనత గిడుగు వారిదే అని. మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ,సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించటానికి తెలుగు భాషను కాపాడుకోవాలని తెలియజేశారు. అంతేకాక సవర భాషకు లిపి లేదు ఆయన స్వయంగా సవర భాషను నేర్చుకొని ప్రత్యేకంగా పద భాషను తయారుచేసి ఎన్నో పుస్తకాలు రచించి వారి కోసం ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేసి తన సొంత డబ్బులతో ఉపాధ్యాయులను నియమించి విద్య నేర్పినందుకు గుర్తుగా అప్పటి ఆంగ్ల ప్రభుత్వం 1934 లో కైజర్ ది హింద్ అనే బిరుదుతో స్వర్ణ పథకంతో సత్కరించెను. 19 13 లో రావు సాహెబ్ అనే బిరుదును ప్రభుత్వం ఇచ్చెను. 1938 లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వారు కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. గ్రంథాలయంలోని తెలుగు పుస్తకాలను చదవడం ద్వారా భాషా పరిజ్ఞానం, పద సంపద పటన శక్తి పెరుగుతాయి అన్నారు.
గిడుగు సరస్వతి మాట్లాడుతూ తల్లితండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను తెలుగులో మాట్లాడేటట్టు తెలుగు పుస్తకాలు చదివించాలని అందరూ తెలుగు భాషను ప్రేమిద్దాం ప్రోత్సహిద్దాం అని తెలియజేశారు. మరియొక అతిథిగా మల్లెతీగ ఎడిటర్ కలిమిశ్రీ పాల్గనీ గిడుగు వారి సేవల గురించి ప్రసంగించారు. అనంతరం గ్రంథాలయాధికారి కే రమాదేవి నాగేశ్వరరావు ని, సరస్వతి ని, కలిమి శ్రీ ని దృశ్యాలువాతో జ్ఞాపకతో సత్కరించారు.
ఈ కార్యక్రమం గ్రంథాలయాధికారి కే రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది వై ధనలక్ష్మి, వెంకటేశ్వర్, ఫణి బాబు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *