గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులో ఎమ్మెల్సీగా ఎన్నికైన వర్ల రామయ్య కి పిళ్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నానని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నాజిర్ అహ్మద్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, ఛైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని వర్ల రామయ్య కి అభినందనలు తెలిపారు.
వర్ల రామయ్య ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి, పార్టీ బలోపేతానికి మరో నిదర్శనం. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడిన సీనియర్ నాయకుడికి ఈ అవకాశం దక్కడం ఎంతో సంతోషకరం. ఆయన అనుభవం, సేవలు శాసనమండలిలో పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతాయని విశ్వసిస్తున్నాను.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, యువనేత నారా లోకేష్ మార్గదర్శకత్వంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అంకితభావంతో సేవ చేయడమే మనందరి లక్ష్యం. వర్ల రామయ్య కి మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News