కళాశాల విధ్యార్థులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో స్థానిక వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలోని విధ్యార్ధులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా వి.రాజామోహన్, ప్రివెన్షన్ యూనిట్, మైగ్రెన్ట్స్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు 60 రోజులపాటు, వీధినాటికలు, యల్.ఇ.డి వ్యాన్, కరవత్రాలు/గోడపత్రికలు పంపిణి, క్యు.ఆర్ కోడ్ ద్వారా రిక్స్ అనెస్మెంట్ ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహనను కల్పిస్తున్నామని అందులో బాగంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడమైనదని అన్నారు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ని నిర్మూలించేందుకు యువత భాగస్వామ్యం కావాలని హెచ్.ఐ.వి గురించి ప్రతిఒక్కరూ అవగాహన పొందేలా మీ వంతు సహకారం అందివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం రాజా రావు, ఐ.సి.టి.సి కౌన్సిలర్, కంకిపాడు మాట్లాడుతూ హెచ్.ఐ.వి ప్రధానంగా సురక్షితం కాని లైంగిక సంభందాల వల్ల ఎక్కువగా సంక్రమిస్తుందని, ఈ వైరస్ సోకిన వ్యక్తి తన జీవితాంతం ఎ.ఆర్.టి మందులను తీకుకోవాలని, దానితోపాటు సమపాళ్ళలో పోషకాహారం తీసుకుంటే జీవిత కాలంగణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు.. తరచూ సుఖరోగాల బారిన పడేవారికి హెచ్.ఐ.వి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు శివరామ ప్రసాద్, శుష్మ, వాసవ్య మహిళా మండలి ఆరోగ్య కార్యకర్త కె.రాజేష్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *