ఘనంగా చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల ప్రచారం – శోభాయాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర మహోత్సవాల (జన్మదిన వేడుకలు) పురస్కరించుకుని నగరంలో ఆధ్యాత్మిక చైతన్య శోభాయాత్ర (ర్యాలీ) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. స్వామివారి శతాబ్ది వేడుకల సందేశాన్ని, సనాతన ధర్మ విలువులను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో భక్తులు ఈ భారీ ప్రదర్శనను చేపట్టారు. విజయవాడ బెంజ్ సర్కిల్ జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ర్యాలీ లబ్బీపేట వరకు కొనసాగింది. శోభాయాత్ర పొడవునా భక్తులు మంగళవాయిద్యాలు, భజన కీర్తనలు, మరియు జై శ్రీమన్నారాయణ నామస్మరణలతో విజయవాడ పురవీధులను ఆధ్యాత్మిక సాగరంగా మార్చేశారు. స్వామివారి చిత్రపటాలు, “శ్రీరామ హృదయం” ప్లకార్డులతో సాగిన ఈ ప్రదర్శన నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఆర్గనైజర్లు మాట్లాడుతూ, సమాజంలో మానవీయ విలువలు పెంపొందించడానికి, ప్రతి కుటుంబంలోనూ ప్రేమ, గౌరవం, స్నేహభావాలు వర్ధిల్లడానికి స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. అందులో భాగంగా 29-07-2026 నుండి 26-10-2026 వరకు మొత్తం 90 రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటలకు ఇండ్లలో భక్తులు “శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం” చేస్తూ ఈ “శ్రీరామ హృదయం” మరియు “సత్సంగము” కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

నవంబర్ 8వ తేదీన దీపావళి నాడు రానున్న స్వామివారి తిరునక్షత్ర మహోత్సవ వేడుకల్లో భక్తులందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముంతా మాధవిభాస్కరరావు , వి రాఘవన్, పచ్చిపులుసు వెంకట శివ ప్రసాద్, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *