బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి భవాని పురం ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు. ఊర్మిళా నగర్ కు చెందిన సముద్రాల నాగమహాలక్ష్మి (10) బ్రెయిన్ స్ట్రోక్ గురై అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను 43 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన రాంబాబు, మరియు శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ దరిశి సీతామహాలక్ష్మి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *