Breaking News

సీ పీ ఐ నేత పల్లా సూర్యరావు కుటుంబ సభ్యులకు పరామర్శ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీపీఐ సీనియర్ నేత, విజయవాడ సీ పీ ఐ మాజీ కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ స్వర్గీయ పల్లా సూర్య రావు కుటుంబ సభ్యులను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పరామర్శించారు.. శుక్రవారం కొత్తపేటలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో సూర్యారావు మృతి చెందారు. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , శనివారం కొత్తపేటలోని సూర్యారావు నివాసానికి వెళ్లి వారి సతీమణి పల్లా దుర్గాంబ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం కోల్పోకుండా ఉండాలని సూచించారు. ఎ ఐ టీ యూ సీ రాష్ట్ర నాయకునిగా భవన నిర్మాణరంగ కార్యదర్శిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.. వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *