స్వర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు కార్యాలయాల్లో ప్ర‌తిరోజూ పీజీఆర్ఎస్‌

– మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రజ‌ల నుంచి అర్జీల స్వీకరణ
– అర్జీల నమోదు నుంచి పరిష్కారం వరకు నిరంతర పర్యవేక్షణ
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను సులభంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి అయిదు గంటల వరకు అర్జీలు స్వీక‌రించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.
ప్రతి స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్‌) రిజిస్టర్‌ను నిర్వహిస్తూ పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు, డిజిటల్‌ సహాయకులు, వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటార‌న్నారు. వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు, స‌ర్వే అసిస్టెంట్లు, రెవెన్యూ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్లు త‌దిత‌రులు కూడా ఆయా స‌మ‌యంలో అందుబాటులో ఉంటార‌న్నారు. ప్రతి స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు ప్ర‌తి పనిదినం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్వీకరించబడును అనే సమాచారంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లను ఇప్ప‌టికే ఆదేశించామ‌న్నారు. క్యూఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్‌, పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల న‌మోదుపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో సేవ‌ల నాణ్య‌త‌ను మెరుగుప‌ర‌చాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నిర్ణీత గ‌డువులోగా అర్జీల‌ను జవాబుదారీతనంతో, నాణ్యంగా పరిష్కరించేలా మండల, డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల చెంత‌నే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వీలుగా ప్ర‌భుత్వం చేసిన ఏర్పాట్ల‌ను ప్ర‌జ‌లు సద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *