దివ్యాంగుల స్వావలంబనకు ప్ర‌గ‌తి చ‌క్రాలు!

– 58 మందికి ఉచితంగా రూ. 66.70 లక్షల విలువైన వాహనాలు
– ఉద్యోగాలు, జీవనోపాధికి ఊతంగా ప్రభుత్వం అండ
– గౌరవప్రదమైన జీవనానికి వీలుక‌ల్పించేలా కార్య‌క్ర‌మం
– విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల స‌హాయ సంస్థ ఛైర్మ‌న్ గ‌డుపూటి నారాయ‌ణ‌స్వామి, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్ర‌తిభావంతులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ పనులు చేసుకునేందుకు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మోటరైజ్డ్ త్రిచ‌క్ర వాహనాలు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల స‌హాయ సంస్థ ఛైర్మ‌న్ గ‌డుపూటి నారాయ‌ణ‌స్వామి, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
శ‌నివారం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల స‌హాయ సంస్థ ఛైర్మ‌న్ గ‌డుపూటి నారాయ‌ణ‌స్వామి, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ త‌దిత‌రులు పాల్గొని 58 మందికి రూ. 66.70 ల‌క్ష‌లు విలువైన స్కూట‌ర్ల‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌స్వామి మాట్లాడుతూ దివ్యాంగుల‌కు ఈ వాహ‌నాలు ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి, ఇతర జీవనోపాధి కార్యకలాపాలకు సులభంగా వెళ్లేందుకు ఉపయోగపడతాయని అన్నారు. రోజువారీ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవ‌స‌రం లేకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. వాహనం కేవలం రాకపోకలకు మాత్రమే కాకుండా దివ్యాంగుల స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి, జీవనోపాధికి ఒక సాధనంగా నిలుస్తాయ‌న్నారు.
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం శారీరక వైకల్యం కలిగిన అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా రీట్రోఫిట్‌ చేసిన మోటరైజ్డ్‌ వాహనాలను అందించే కార్య‌క్ర‌మాన్ని అమలు చేస్తున్న‌ట్లు తెలిపారు. దివ్యాంగులకు సులభమైన రాకపోకలు, స్వయం సమృద్ధి, గౌరవప్రదమైన జీవనం, స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 113 దరఖాస్తులు అందగా జిల్లా ఎంపిక కమిటీ ప్రభుత్వ మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాల మేరకు దరఖాస్తులను పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అనంతరం ఎంపికైన 58 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కటి రూ. 1.15 లక్షల విలువైన మోటరైజ్డ్‌ త్రీ వీలర్‌ వాహనాలను స‌మ‌కూర్చిన‌ట్లు తెలిపారు.
కార్య‌క్ర‌మంలో విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వాడ్రేవు కామ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *