సంయమనం, బాధ్యతతో నిరీక్షిస్తూ వచ్చాం..

-ఇదే పరిస్థితి ఉంటే ఉద్యమ బాట తప్పదు
-ఇప్పటికైనా చర్చలకు పిలవాలి.. చర్చల ద్వారా పరిష్కారానికి మా మొదటి ప్రాధాన్యత
-పీఆర్సీ, డీఏలు, బకాయిల చెల్లింపులే ప్రధాన డిమాండ్లు
-లేదంటే సెప్టెంబర్ 5న జేఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తాం
-ఏపీ జేఏసీ ఛైర్మన్ ఏ. విద్యాసాగర్ సెక్రటరీ జనరల్ కె ఎస్ ఎస్ ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెండేళ్లుగా సంయమనం, బాధ్యతతో ప్రభుత్వానికి సహకరిస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం నశిస్తోందని ఏపీ జేఏసీ ఛైర్మన్ ఏ. విద్యాసాగర్ సెక్రటరీ జనరల్ కె ఎస్ ఎస్ ప్రసాద్ అన్నారు. పీఆర్సీ, ఐదు డీఏలు, సరెండర్ లీవ్‌లు, ఇతర బకాయిలతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవాలని కోరారు. సెప్టెంబర్ 5లోపు పరిష్కార మార్గాలను చూపకపోతే ఉద్యమ మార్గంలోకి వెళ్లక తప్పదని, సెప్టెంబర్ 5న 200కు పైగా ఉద్యోగ సంఘాలతో జరిగే రాష్ట్ర జేఏసీ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కె.ఎస్.ఎస్ ప్రసాద్ ఆదివారం నగరంలోని ఏపీ ఎన్జీవో హోమ్ లో జేఏసీ నేతలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలైన పీఆర్సీ, డీఏలు, సరెండర్ లీవ్‌ల చెల్లింపులు, ఇతర బకాయిలతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగుల మన భావాన్ని తెలియజేశామని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జేఏసీ సంఘాలతో సమావేశం నిర్వహించిందని, అనంతరం ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని పేర్కొన్నారు. అయితే పీఆర్సీ, డీఏలు, ఇతర బకాయిలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్నారు.
సెప్టెంబర్ 5న ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం
రాష్ట్రంలోనే ప్రధాన JAC గా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని, చర్చలు ఒక సామరస్య పూర్తి వాతావరణం లో జరగాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఉద్యోగులకు కూడా ఉందని, ప్రభుత్వo మరియు ఉద్యోగుల మధ్య అటువంటి సామరస్య వాతావరణం ఉన్నప్పుడే రాష్ట్ర ప్రగతికి కూడా దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 5వ తేదీలోపు సమస్యల పరిష్కారానికి స్పష్టమైన మార్గాలను ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే సెప్టెంబర్ 5న నిర్వహించే రాష్ట్ర జేఏసీ సమావేశంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి 200కు పైగా ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని తెలిపారు.
పీఆర్సీ, డీఏలు, ఇతర బకాయిల చెల్లింపులు తమ ప్రధాన డిమాండ్లని విద్యాసాగర్ తెలిపారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విడతల వారీగానైనా వాటిని చెల్లించాలని కోరారు. 2020 నుంచి సరెండర్ లీవ్‌ల చెల్లింపులు నిలిచిపోయాయని, వాటిని కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలి
పీఆర్సీ, డీఏలు ఇస్తామని ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారని, ఆ హామీలను అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందన్నారు. గత రెండేళ్లుగా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారని, కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిన నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వేచి చూశామని తెలిపారు.
ఒకటో తేదీన జీతాల చెల్లింపు, పోలీసు కేసుల ఎత్తివేత, సుమారు రూ.22 వేల కోట్ల మేర బకాయిల చెల్లింపు వంటి చర్యలు, 11 వేల మందికి సిపిఎస్ నుంచి ఓపిఎస్ అమలు, పదవి విరమణ వయసు ప్రభుత్వ రంగ సంస్థలకు 60 నుంచి 62 కు పెంచడం, 8000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లు వేగవంతం చేయడం వంటి సానుకూల నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని వాటిని మరియు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు ఇప్పటివరకు సంయమనం పాటించారని, అయితే ఉద్యోగుల్లో సహనానికి కూడా పరిమితి ఉంటుందని అన్నారు.
13 లక్షల మంది ఉద్యోగుల తరఫున విజ్ఞప్తి
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ఉద్యోగులదేనని, అందువల్ల ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించాలని విద్యాసాగర్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు సంప్రదిల్లారని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, బాధ్యతాయుతమైన ప్రధాన వ్యవస్థగా సంఘంగా చర్చిలు సానుకూల వాతావరంలో జరిగేటట్లు బాధ్యతతో వ్యవహరిస్తున్నామని చర్చిలు విఫలమైన పరిస్థితిలో ఉద్యమ కార్యాచరణ నివారణ అవుతుందని స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ సుమారు 13 లక్షల మంది ఉద్యోగుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు. ఏపీ జేఏసీ ఒక ఉద్యోగ సముద్రమన్న విషయాన్ని కూడా గుర్తించాలని వ్యాఖ్యానించారు.
ఉద్యమాలు, సమ్మెలు మాకు కొత్త కాదు
ఏపీ జేఏసీ చాలా పెద్ద వ్యవస్థ అని, ఉద్యమాలు, సమ్మెలు తమకు కొత్త కాదని విద్యాసాగర్ అన్నారు. ప్రస్తుతం విషయం చర్చల స్థాయిలో ఉన్నందువలన సమయం ను పాటిస్తున్నామని తెలిపారు.
ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ కె. ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ… ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని ఇప్పటికీ ఈనెల 31 లోపు చర్చలకు పిలవాలని కోరారు. హెల్త్ కార్డులు, పెన్షనర్లకు ఎడిషనల్ క్వాంటం పెన్షన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు అన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయని, లక్షలాది మంది ఉద్యోగులు కుడా ఇప్పుడు ఎపి జెఎసి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని చర్చలకు పిలిచి ఐదో తేదీ లోపు పరిష్కారం మార్గాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నామని.. లేదంటే ఏపీ జేఏసీ తప్పనిసరిగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
సమావేశంలో ఎ. సాంబశివరావు (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్), కె. బసవలింగేశ్వరరావు (ఏపిటిఎఫ్ 257), డి. వెంకటేశ్వర్లు ( స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్), పి.రాజు (ఆంధ్రప్రదేశ్ టీ అండ్ ఏ గెజిటెడ్ సర్వీసెస్), జానీ పాషా షేక్ (ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయం), పి.వి. సాయి కుమార్ (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్), మహమ్మద్ ఆరిఫ్, కె. వెంకటేశ్వరరావు (ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్), ఎస్.ఎల్. సోమయాజులు (ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్),
జి.వి.ఎస్. రామకృష్ణ ( పిఆర్‌టియు), డి. చంద్రశేఖర్ (ఎ.పి.ఎస్.టి.యు.), బి. సేవానాయక్ (ఆంధ్రప్రదేశ్ ఎన్ జీ వీ ఎఫ్), రాజబాబు (ట్రాన్స్పోర్ట్) ఏపీ ఎన్ జి ఓ నేతలు ఎన్. భారతి ప్రసాద్ సుబ్బారెడ్డి డ
కె. జగదీశ్వరరావు బి.జానకి, సిహెచ్. శ్రీధర్ డి. సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *