బకాసుర పల్లి రెస్టారెంట్ నూతన శాఖ ప్రారంభోత్సవంలో బొండా రవితేజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, ఫ్లైఓవర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బకాసుర పల్లి రెస్టారెంట్ నూతన శాఖ సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రెస్టారెంట్‌కు చేరుకున్న బొండా రవితేజ కి నిర్వాహకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు, అనంతరం నూతన శాఖను సందర్శించిన ఆయన రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. రెస్టారెంట్ నిర్వాహకులతో మాట్లాడి వ్యాపార అభివృద్ధికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం బొండా రవితేజ మాట్లాడుతూ విజయవాడ నగరంలో వ్యాపార రంగం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలు అందిస్తూ బకాసుర పల్లి రెస్టారెంట్ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ శాఖ విజయవంతంగా కొనసాగాలని, భవిష్యత్తులో మరిన్ని శాఖలను ఏర్పాటు చేసి అభివృద్ధి చెందాలని బొండా రవితేజ ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన శాఖ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు, బొమ్మిడి శ్రీనివాస్, చింతల దుర్గాప్రసాద్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *