విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగా మంగళవారం సర్కిల్–2 పరిధిలోని 60వ వార్డు వాంబే కాలనీ, సింగ్‌నగర్ యార్డ్ రోడ్ ఔట్‌ఫాల్ డ్రెయిన్ ప్రాంతంలో బయాలజిస్ట్ సూర్య నాయక్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డ్రెయిన్ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం మరియు ఇతర వ్యర్థాలను తొలగించారు. వ్యర్థాల తొలగింపునకు లాంగ్ ఆర్మ్ 245 సీసీ మెకానికల్ యంత్రాన్ని వినియోగించి డ్రెయిన్ పరిసరాలను శుభ్రం చేశారు.
డ్రెయిన్‌లలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో, డ్రెయిన్‌లలో వేయకుండా నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని సూచించారు.
నగరంలో పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వర్షపు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా డ్రెయిన్‌లలో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించే చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News