నగరంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, వాటర్ ప్లాంట్లపై ముమ్మర తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్యం సిబ్బంది మంగళవారం ఉదయం కలరా హాస్పిటల్, మిల్క్ ఫ్యాక్టరీ, ధోబి ఖానా, లయోలా కాలేజ్ రోడ్డు పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మరియు ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మణికంఠ టిఫిన్ సెంటర్, శ్రీకృష్ణ వాటర్ ప్లాంట్, వీనస్ చికెన్ షాప్, మాధురి కర్రీస్ పాయింట్తో పాటు పలు హోటళ్లు, తిరుమల టిఫిన్స్ ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార వ్యర్థాల నిర్వహణ, డస్ట్‌బిన్ల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో కొన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత లోపాలు, ఫుడ్ వేస్ట్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం, డస్ట్‌బిన్లు లేకపోవడం, పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం వంటి లోపాలను గుర్తించారు. ఈ మేరకు సంబంధిత హోటల్, వ్యాపార సంస్థల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఏడు రోజులలోపు గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత సంస్థలపై జరిమానా విధించడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మరియు ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని విజయవాడ నగరపాలక సంస్థ తెలియజేసింది.

ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *