విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక నిమజ్జన ఏర్పాట్లను మరింత పెంచండి మరింత పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, సీతమ్మ వారి పాదాల వద్ద జరుగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి చివరి రోజులు కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పూజా వ్యర్థాలను విగ్రహాల నుంచి వేరు చేసి సేకరించే పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను మరింత పెంచి, ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, వియంసి వారు ఏర్పాటుచేసిన తాగునీరు, వైద్య శిబిరాల లో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. నిర్మల గ్లోరీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News