బిల్డింగ్ ప్లాన్ సమస్యల పరిష్కారానికి ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించి ప్రజలు ఆన్లైన్ లో ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కమిషనర్ స్వయంగా పరిశీలించి, అక్కడ అందుబాటులో ఉన్న ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగర ప్రజలు తమ భవన నిర్మాణాలకు సంబంధించి బిల్డింగ్ ప్లాన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్లికేషన్ ప్రాసెస్, ప్లాన్ డ్రాయింగ్, పేమెంట్స్ తదితర అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చని అన్నారు.

బిల్డింగ్ ప్లాన్‌లకు సంబంధించిన ప్రక్రియలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం అందించాలని సంబంధిత సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. హెల్ప్ డెస్క్‌ను సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ప్లానింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *