బలగ గణేష్ సాధించిన ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవలే జర్మనీలోని ఫ్రెడరిక్షఫెన్ (Friedrichshafen) నుంచి స్విట్జర్లాండ్‌లోని రోమన్‌షోర్న్ (Romanshorn) వరకు సుమారు 12 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 14 నిమిషాల్లో, 16.5 డిగ్రీల సెల్సియస్ చల్లటి నీటిలో ఎలాంటి వెట్‌సూట్ (Wetsuit) సహాయం లేకుండా ఈదుతూ విజయవంతంగా పూర్తి చేసి రికార్డ్ సృష్టించిన స్విమ్మర్ బలగ గణేష్ ను ఈ రోజు విజయవాడ లోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, బలగ గణేష్ సాధించిన ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. కఠోర సాధన, అచంచలమైన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటడం అభినందనీయమన్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చల్లటి నీటిని సైతం లెక్కచేయకుండా సుమారు 12 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని విజయవంతంగా ఈదడం గణేష్ క్రమశిక్షణ, నిరంతర సాధనకు నిదర్శనమని అన్నారు. ఆయన సాధించిన ఈ ఘనత రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని రవి నాయుడు గారు పేర్కొన్నారు.

భవిష్యత్తులో బలగ గణేష్‌ మరిన్ని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గొప్ప విజయాలు సాధించాలని, యువతకు స్ఫూర్తిగా నిలవాలని శాప్ చైర్మన్ రవి నాయుడు గారు ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *