గురజాడ.. సామాజిక మార్పున‌కు స్ఫూర్తిజాడ..

– తెలుగు సాహిత్యానికి ఆధునిక దిశను చూపిన మహనీయుడు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సాహిత్యాన్ని సుసంప‌న్నం చేసి ప్ర‌జ‌ల‌కు ఆధునిక దిశను చూపడంతో పాటు, తన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని రగిలించిన మహనీయుడు గురజాడ అప్పారావు అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురజాడ రచనలు సమాజంలోని అసమానతలు, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలపై ఆలోచింపజేసి మార్పు వైపు నడిపించాయని పేర్కొన్నారు.
న‌వ‌యుగ వైతాళికుడు గుర‌జాడ అప్పారావు జ‌యంతి సంద‌ర్భంగా సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, అధికారుల‌తో క‌లిసి గుర‌జాడ చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గుర‌జాడ రచనలు సామాజిక అసమానతలు, మూఢనమ్మకాల‌పై ఆలోచన రేకెత్తిస్తూ ప్రజల్లో మార్పు కోసం స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అనే గురజాడ సందేశం దేశం, సమాజం పట్ల ప్రతిఒక్కరికీ ఉన్న బాధ్యతను గుర్తుచేస్తోందన్నారు. గురజాడ సాహిత్య స్ఫూర్తితో యువత మానవతా విలువలు, సామాజిక బాధ్యత, సమాజ అభ్యున్నతి పట్ల నిబద్ధతను పెంపొందించుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *