విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.26.09.2026 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గo లోని *కాకపర్తి భవనారాయణ (KBN) కాలేజ్, Vijayawada నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీ. చల్లా మధుభూషణ రావు గారు తెలియజేసారు.
ఈ జాబ్ మేళా లో సుమారు 14 ప్రముఖ కంపెనీలు హాజరు అవుతున్నాయి. ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు 10 వ తరగతి, ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బి.టెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువతి మరియు యువకులు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు Rs. 12,000/- నుంచి Rs. 50,000/- వరకు వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు Resume లేదా Bio Data Form లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్, PAN కార్డ్ కాపీ మరియు సర్టిఫికెట్ల Xerox కాపీలతో రావాలని తెలిపారు మరియు మరిన్ని వివరాలకు * 9700092606, 9700025833 మరియు 8712495530* నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News