ఈశ్వర విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ ఈశ్వర, విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా సోమవారం గణపతి మండపం ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు. 47 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, 46 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పోతినీడి లోకేష్, జనసేన పార్టీ 47 వ డివిజన్ అధ్యక్షుడు వేంపలి గౌరీ శంకర్ , ఈశ్వర విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ధన బోయిన శ్రీనివాస్, హేమంత్, కళ్యాణ్, బాలాజీ, మహేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *