-జగన్ హయాంలో మైనార్టీలకు జరిగిన మేలుపై త్వరలో శ్వేతపత్రం విడుదల
-కూటమి ప్రభుత్వంలో మైనార్టీల హక్కుల కాలరావే ధ్యేయం
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ ఖాన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైనార్టీల అభ్యున్నతకు వైయస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలో డీఎస్సీ భారీ ర్యాలీకి వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖాదర్ భాషా ను అలింగణం చేసుకొని, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం త్వరలోనే మరో విస్తృత స్థాయి మైనార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
2019-2024 మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం డిబిటి ద్వారా మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందించమన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీల కోసం తెచ్చిన 4% రిజర్వేషన్లు వారి జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. ఈ ప్రయోజనాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాం అని విష్ణు స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మైనార్టీల సంక్షేమానికి, వికాసానికి జరిగిన మంచిని వివరిస్తూ త్వరలోనే ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో ప్రస్తుత చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ… కూటమి పాలనలో మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారని, గత రెండున్నరేళ్లుగా దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.దివంగత వైఎస్సార్ బాటలోనే వైఎస్ జగన్ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. 4% రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు మైనార్టీ విద్యార్థుల జీవితాలను మార్చేశాయన్నారు.
మహానేత వైఎస్సార్ బాటలోనే నడిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనార్టీలకు అత్యున్నత రాజకీయ ప్రాధాన్యత కల్పించారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీ నేతలకు 9 కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించి రాజకీయంగా గుర్తింపు ఇచ్చారాని అని పేర్కొన్నారు.
ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లాది విష్ణుకు స్థానిక ఎన్నికల్లో పూర్తి మద్దతుగా నిలవాలని, భవిష్యత్తులో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కదిరి ప్రకాశం డిస్ట్రిక్ట్, స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వేమూరు నియోజకవర్గం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఇమామ్ హుస్సేన్, జిల్లా మైనారిటీ విభాగం ప్రెసిడెంట్ మస్తాన్, విజయవాడ సెంట్రల్ మైనార్టీ వింగ్ అధ్యక్షులు అబ్దుల్ నజీర్, 60 వ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ఫాతిమా, ఆశ, అక్బర్, ఇస్మాయిల్, పఠాన్ ఖాన్, ఇస్మాయిల్, సుభాని, వలి,నాగూర్, భాషా, రఫీ, భాషా, కాశీం,కరిముల్లా, బాజీ, మదీనా, బబుల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ విభాగం కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News