విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ , శ్రీ దినా వాహి వారి సత్రం పాలక మండల సభ్యులు వెరుకొండ ఉమాకాంత్ భవాని పురం ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజరాజేశ్వరి పేటకు చెందిన గొరుసుపిట్టి అమ్మనరావు (39) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6.60 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News