సింగ్‌నగర్, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్‌నగర్‌లో హప్ డైలీ ఔట్‌లెట్ షాప్ ప్రారంభమైంది. సోమవారం సింగ్‌నగర్‌లోని ఫైర్‌స్టేషన్ దగ్గర రాజీవ్‌నగర్‌రోడ్డులో ముఖ్యఅతిధిగా విచ్చేసిన వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మన్నికైన పదార్ధాలు అందించే అరుణ్ ఐస్‌క్రీమ్ వారి హప్ డైలీ ఔట్‌లెట్ షాప్ అందరికీ సుపరిచితమని సింగ్‌నగర్ ప్రజల వాసులకు అందుబాటులో ప్రారంభించబడిందని వీరి ప్రొడక్ట్స్ అందజేస్తూ మరిన్ని సేవలు అందజేయాలని కోరారు. నిర్వాహకులు వేముల జాషువా మాట్లాడుతూ అరుణ్ ఐస్‌క్రీమ్ హప్ డైలీ పలు ప్రాంతాలలో వున్నాయని అందరికీ సుపరిచితమని అందరి ఆదరాభిమానాలు పొందుతున్నాయన్నారు. ఇప్పుడు సింగ్‌నగర్ వాసులకు హప్ డైలీ ఔట్‌లెట్ షాప్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ హప్ డైలీ ఔట్‌లెట్ షాప్ 41వది అని తమ వద్ద ఐస్‌క్రీమ్స్, ఐస్‌క్రీమ్ కేక్స్, హేనోబార్ చాక్లెట్స్, బటర్‌మిల్క్, లస్సీ, పాలు, ఓయేలా పిజ్జి, హాట్‌సన్, ఐబాకో, సంతోష, మిల్క్‌ప్రొడక్ట్స్ తదితర రకరకాల పదార్థాలు అందుబాటు ధరలలో అందజేస్తున్నామన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన వంగవీటి రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కొనుగోలుదారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News