శ్రీ విజయ వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ విజయ వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఏలూరు రోడ్డు చుట్టుగుంటలో సోమవారం జరిగిన వేడుకల్లో శ్రీ విజయ వినాయక మహోత్సవ కమిటీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదర్ల రాజబాబు దంపతుల ఆశీస్సులతో మహంతి వాసుదేవరావు, పేదర్ల రాజబాబు ఉత్సవ కమిటీ చైర్మన్ల అధ్యక్షతన వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతొ పూజలు అందుకున్న గణనాథుడు ఈ వేడుకల్లో భాగంగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేదర్ల రాజబాబు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కమిటీ మెంబర్లు మాట్లాడుతూ 4000 మందికి మహా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వినాయకుని ఉత్సవం ఘనంగా దాతలు పెద్దలు ప్రజలు సహకారంతో నిర్వహించగలుగుతున్నామని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పేదర్ల రాజబాబు, మహంతి వాసుదేవరావు, ఉత్సవ కమిటీ సభ్యులు కొమిడి అప్పారావు, పాశం కృష్ణ, సోమేశ్, దేవరాజ్, సాయి, అడబాల సుబ్బారావు, కోలా నాగాంజనేయులు, లక్ష్మీ ప్రసాద్, వేణు,శివ, శ్రీను, సురేష్, మల్లేష్,మల్లి, మహేష్, దినేష్, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *