రాయచోటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి , రూ.244.32 కోట్లతో మౌలిక వసతుల పనులు

-చంద్రబాబు నాయకత్వంలో పట్టణాభివృద్ధికి మహర్దశ…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, వీధి దీపాలకు ప్రాధాన్యత
-పట్టణాభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి, పురపాలక శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అన్నమయ్య జిల్లా, రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయచోటి పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి వివిధ పథకాల కింద రూ.244.32 కోట్ల మేర నిధులు కేటాయించడంపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా రాష్ట్రంలోని పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు చేపడుతోంది.
ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరా, సమర్థవంతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ, సుస్థిరమైన ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ, నాణ్యమైన సీసీ/తారు రోడ్లు, డివైడర్లు, విద్యుత్ ఆదా చేసే వీధి దీపాలు, పార్కులు, ఆటస్థలాలు వంటి మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను AMRUT, SBM వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు AIIB, IFC వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, HUDCO, ఇతర ప్రభుత్వ బ్యాంకుల రుణాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానాలు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) వంటి వివిధ మార్గాల ద్వారా సమీకరిస్తోంది.

రాయచోటికి రూ.244.32 కోట్ల నిధులు
రాయచోటి మున్సిపాలిటీలో కీలకమైన పట్టణ మౌలిక వసతుల కల్పనకు మొత్తం రూ.244.32 కోట్ల మేర నిధులు కేటాయించబడ్డాయి.

అమృత్ 2.0
తాగునీటి సరఫరా, నీటి వనరుల పునరుద్ధరణ పనులకు రూ.3.68 కోట్లు కేటాయించగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.

SBM 2.0
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ.4.96 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపుల వివరాలు
రోడ్లు, డ్రెయిన్లు, పూడికతీత తదితర పనులకు రూ.3.68 కోట్లు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి.
ఈ మూడు విభాగాల్లో ప్రస్తుతం జరుగుతున్న పనుల మొత్తం విలువ రూ.12.32 కోట్లు.

-రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాల (HAM) అభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించగా ప్రస్తుతం టెండర్ దశలో ఉందనీ, అదేవిధంగా తాగునీటి సరఫరా, డ్రెయిన్ల (UIDF-IV) నిర్మాణానికి రూ.197 కోట్లు కేటాయించగా ప్రస్తుతం పాలనా అనుమతుల దశలో ఉందని తెలిపారు.

దీంతో రాయచోటి పట్టణానికి కేటాయించిన మొత్తం నిధులు రూ.244.32 కోట్లకు చేరుకున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా రాయచోటి పట్టణానికి మెరుగైన మౌలిక వసతులు కల్పించే ఈ పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. ప్రజలకు మెరుగైన పట్టణ సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాయచోటి సమగ్ర అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *