86 వార్డుల ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపుపై బీఎల్వోలకు శిక్షణ

-ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం. ఆదేశాల మేరకు డీ-లిమిటేషన్ అనంతరం ఏర్పాటైన 86 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించే ప్రక్రియపై బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బందికి మంగళవారం గాంధీనగర్‌లోని కందుకూరి కళ్యాణ మండపంలో డిప్యూటీ కమిషనర్ జి. సృజన, జోనల్ కమిషనర్ల ఆధ్వర్యం లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన మాట్లాడుతూ, సెప్టెంబర్ 22, 2026 న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 86 వార్డుల ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను మున్సిపల్ కార్యాలయాలు, ఇతర సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్లను గుర్తించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందులో భాగంగా 23 నుంచి 25 సెప్టెంబర్ 2026 వరకు మూడు రోజుల పాటు వార్డు వారీగా, పోలింగ్ స్టేషన్ వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించాల్సి ఉంటుందని జి. సృజన తెలిపారు. ఓటర్ల వివరాలను ఎలక్టోరల్ రోల్స్‌తో సరిపోల్చుకుని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని ఆమె సూచించారు. బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. 26 సెప్టెంబర్న డ్రాఫ్ట్ జాబితాల ప్రచురణ, 27–28 సెప్టెంబర్న క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, 29–30 సెప్టెంబర్ పరిశీలన, ఫీల్డ్ వెరిఫికేషన్, అభ్యంతరాల పరిష్కారం నిర్వహించి, 1 అక్టోబర్ 2026న తుది జాబితాలను ప్రచురించాల్సి ఉంటుంది.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు శ్రీనివాస్, ప్రభుదాస్, షమ్మీ, అసిస్టెంట్ కమిషనర్లు ఎ.యు.బి. శర్మ, హెలెన్, ప్రభావతి, స్కూల్ సూపర్‌వైజర్లు , రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *