స్వచ్ఛతా హి సేవ లో భాగంగా పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పాఠశాల విద్యార్థులకు పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న పింక్ టాయిలెట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పింక్ టాయిలెట్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలు, సేవలను విద్యార్థులకు వివరించారు. పబ్లిక్ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్లను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవడంతో పాటు వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. టాయిలెట్లను ఉపయోగించిన అనంతరం పరిసరాలను అపరిశుభ్రంగా చేయకుండా, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని సూచించారు.

పరిశుభ్రమైన మరుగుదొడ్ల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు ఎంతో ముఖ్యమని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకుని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రత పట్ల బాధ్యతను మరింత పెంపొందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *