Breaking News

చిట్టినగర్, శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజైన గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఆలయ అధ్యక్షుడు పోతిన భేసు కంటేశ్వరుడు,
కమిటీ సభ్యులు ప్రత్తిపాటి శ్రీధర్ కు స్వాగతం పలికారు. దేవస్థాన కమిటీ సభ్యులు తొత్తడి భరత్, బెవర సాయి సుధాకర్, చొక్కార శ్రీనివాసరావు, కత్తెర సురేష్, పొట్నూరు శివ, గుడెల మణికంఠ, రాంపిళ్ళ వాసు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …