Breaking News

కనకదుర్గమ్మకు అన్నవరం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అన్నవరం దేవస్థానం తరఫున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి గురువారం మధ్యాహ్నం పట్టు వస్త్రాలను సమర్పించారు. అన్నవరం దేవస్థానం ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ బృందం ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. అన్నవరం ఆలయ బృందానికి విజయవాడ దుర్గగుడి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్‌ స్వాగతం పలికారు. అనంతరం బృంద సభ్యులకు శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కల్పించి, ఆశీర్వచనం అందజేశారు. తీర్థప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …