Breaking News

జగనన్న పాలవెల్లువ పథకం ప్రయోజనాలపై పాడి రైతులకు అవగాహన కల్పించండి… 

-ప్రమోటర్లకు జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత ఆదేశం

ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువ పథకం ప్రయోజనాలపై పాడి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత గ్రామ డైరీ ప్రమోటర్లు, సిబ్బందిని ఆదేశించారు. ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి గ్రామంలోని జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రం లో జగనన్న పాలవెల్లువ పథకంపై ప్రమోటర్లు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.మాధవిలత మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పథకం రైతుల పాలిట వరమన్నారు. ఈ పధకంతో పాడి రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటిని పాడి రైతులకు తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా అవగాహన కలిగించాలన్నారు. పాడి రైతులు అందించిన పాలకు ప్రైవేట్ డైరీల కన్నా 5 నుండి 7 రూపాయల వరకు అధిక రేటు వస్తుందని, వెన్న శాతం లెక్కించడంలో ఖచ్చితత్వం ఉంటుందన్నారు. 90 రోజులపాటు నిరంతరాయంగా పాలు సరఫరా చేసిన వారికి రుణాలు అందించడంతోపాటు, పాడి పశువులకు పోషకాలతో కూడిన దాణా, పాడి పశువులకు అనారోగ్య సమయంలో ఉచిత వైద్య సౌకర్యాలు వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. ఈ ప్రయోజనాలను పాడి రాయితీలు తెలియజేసి, పాల సేకరణ మరింత పెరిగేలా ప్రమోటర్లు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాల సేకరణ కేంద్రంలో పాల సేకరణ, వెన్న శాతం లెక్కింపులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. పాలు సరఫరా చేసేందుకు పాల కేంద్రానికి వచ్చిన మహిళల పాడి రైతులతో ఈ పథకంపై . జాయింట్ కలెక్టర్ చర్చించారు. జాయింట్ కలెక్టర్ వెంట తహసీల్దార్ భరత్ రెడ్డి, ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *