విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, సోమవారం అధికారులతో కలిసి స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అర్జీదారుని సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందులను పరిశీలించి సమస్యతో వచ్చిన ఫిర్యాదు ధరునికి భరోసా కల్పించేలా పరిష్కారించాలని ఆదేశించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక విభాగం – 5, పబ్లిక్ హెల్త్ విభాగం – 1, రెవెన్యూ – 2, యు.సి.డి విభాగం – 1, ఎ.డి.హెచ్ విభాగం – 1, మొత్తం 10 అర్జీలు స్వీకరించుట జరిగింది. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన…
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం -2, పట్టణ ప్రణాళిక విభాగం – , సర్కిల్ – 2 కార్యాలయంలో ఎడ్యుకేషన్ విభాగం -1 అర్జీ అందించగా సర్కిల్ – 1 కార్యాలయంలో ఏవిధమైన అర్జీ వచ్చియుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.
Prajavartha Online Telugu News