వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణలు


-అను మై బేబీ సీఎంఈ-2022లో వక్తలు
-అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వైద్య సదస్సు
-ప్రసూతి, నవజాత శిశు వైద్యం, పీడియాట్రిక్ న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, సర్జరీ విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై విశ్లేషణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య రంగంలో అనేక అద్భుత ఆవిష్కరణలు జరిగాయని, ఆధునిక వైద్య విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు అన్నారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నగరంలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ నందు నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ స్థాయి వైద్య సదస్సు శనివారం ప్రారంభమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, విజయవాడ ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీల సహకారంతో నిర్వహిస్తున్న అను మై బేబీ సీఎంఈ-2022ను డాక్టర్ దుట్టా రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుట్టా ప్రసంగిస్తూ.. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందించేందుకు వైద్యులందరూ కృషి చేయాలని అన్నారు. ప్రసూతి, నవజాత శిశు వైద్యం, పీడియాట్రిక్ న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, సర్జరీ విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై సమగ్రంగా విశ్లేషణ జరిపేందుకు జాతీయ స్థాయి వైద్య సదస్సును నిర్వహిస్తున్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారిని డాక్టర్ దుట్టా ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి వైద్య సదస్సుకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అను గ్రూప్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ రమేష్ గాజుల తన ప్రారంభోపన్యాసం చేస్తూ.. వైద్యరంగంలోని నూతన ఆవిష్కరణల గురించి విస్తృతంగా చర్చించి, వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఈ సీఎంఈ-2022ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అను మై బేబీ హాస్పిటల్ ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రసూతి, నవజాత శిశు వైద్య సేవలను అందిస్తున్నామని, అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా అను గ్రూప్ హాస్పిటల్స్ పనిచేస్తుందని పేర్కొన్నారు. సదస్సులో తొలిరోజైన శనివారం నాడు చిన్నపిల్లలు, నవజాత శిశువుల వైద్య రంగంలోని నూతన ఆవిష్కరణల గురించి చర్చించారు. తొలిరోజు జరిగిన తొలి సెషన్లో డాక్టర్ పి. నటరాజ, డాక్టర్ టి. రమేష్, డాక్టర్ ఖైజర్ బాషా, డాక్టర్ కె. దుర్గానాగరాజు, డాక్టర్ కె.వి. రవికుమార్, డాక్టర్ కె.ఎన్. శ్వేత, డాక్టర్ జి. రమేష్, డాక్టర్ వి. లక్ష్మి, డాక్టర్ ప్రతిమ ఆనంద్, డాక్టర్ అనూష చలసాని, డాక్టర్ గురుప్రసాద్ పేరూరి, డాక్టర్ నిఖిల్ తెన్నేటి, డాక్టర్ సాయి సునీల్ కిషోర్, డాక్టర్ రాజా కిషోర్ కోగంటి తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించారు. అను మై బేబీ సీఎంఈ-2022 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఎంఏ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ రసిక్ సంఘ్వి, ఐఏపీ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ వై. సాయికిశోర్, వీవోజీఎస్ అధ్యక్షురాలు డాక్టర్ కె. గీతాదేవి ముఖ్య అతిధులు హాజరయ్యారు. ఈ సదస్సుకు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ రమేష్ గాజుల కార్యనిర్వాహక అధ్యక్షుడుగానూ, డాక్టర్ కె. దుర్గానాగరాజు, డాక్టర్ పి. నటరాజ కార్యనిర్వహక కార్యదర్శులుగానూ వ్యవహరిస్తున్నారు. సదస్సులో చివరిరోజైన ఆదివారం నాడు ప్రసూతి వైద్య రంగంలోని పలు అంశాలపై విశ్లేషణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *