-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించిన,
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన స్పందన కార్యక్రమములో వచ్చిన అర్జీదారుల సమస్యలను కూలంకషంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ కార్యాలయాలలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను ఆయా శాఖదిపతులకు పంపి సత్వర పరిష్కరం చేసేలా చర్యలు తీసుకోవలెనని, ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చెయవలెనని అధికారులను ఆదేశించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 5, ఇంజనీరింగ్ విభాగం – 7, అకౌంట్స్ విభాగం – 7, పట్టణ ప్రణాళిక విభాగం – 11, పబ్లిక్ హెల్త్ విభాగం –4, యు.సి.డి విభాగం – 8, ఎస్టేట్ విభాగం – 1, రెవెన్యూ – 5, మొత్తం 48 అర్జీలు స్వీకరించుట జరిగింది. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, చీఫ్ ఇంజనీర్ యమ.ప్రభాకర రావు, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 2 అర్జీలు
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 3 కార్యాలయంలో 2 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 1, రెవిన్యూ – 1, సర్కిల్ – 1 మరియు 2 కార్యాలయంలో ఏవిధమైన అర్జీలు సమర్పించి యుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు..
Prajavartha Online Telugu News