కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అట్టడుగు వర్గాల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ,సంఘ సంస్కర్త గా , స్వతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు విజయవిహార్ సెంటర్ లో బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు కేంద్రమంత్రిగా ఎన్నో సేవలందించి ఎన్నో సంస్కరణలు చేసిన బడుగు బలహీన వర్గాలు కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి డా. బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు. సమాజంలో అసమానతలు లేని సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ
వారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులు ఇవ్వడం మన కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమా రి, మునిసిప ల్ వైస్ ఛైర్ పర్స న్ గండ్రోతు అంజలీ దేవి, మాజి ఎమ్మెల్సీ కోడూరి శివరామ కృ ష్ణ, మాజీ యం. ఎల్. ఏ, టివి రామారావు,అక్షయ పాత్ర శ్రీని వాస రవీం ద్ర, ఆర్. భాస్కర రావు, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పా ల్గొన్నారు.
Prajavartha Online Telugu News