కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వద్ద కే పరిపాలన, ప్రభుత్వ పథకాలు అందించాలనే లక్ష్యంతో గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు లో 10 వ వార్డు సచివాలయన్నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సచివాలయ పరిధిలోనే స్పందించి పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్నా మన్నారు.. సచివాలయ స్థాయిలోనే ఆయా సమస్యలు పరిష్కారం చూపడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అంకితభావంతో విధులను నిర్వర్తించగలిగితే ప్రజలు వారి సమస్యలు పరిష్కరం కలెక్టర్ కార్యాలయానికి రావలసిన అవసరం, వ్యయ ప్రయసాలకు తావులేకుండా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ఆయా లక్ష్య సాధనకు అనుగుణంగా మనం పనిచెయ్యలని పేర్కొన్నారు. సచివాలయాలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మునిసిపల్ కమీషనర్లు, మండల స్థాయి అధికారులు క్రమం తప్పకుండా సచివాలయాల తనిఖీ లు చెయ్యాలని, సందర్శన పుస్తకం లో సంతకం చెయ్యాలని కలెక్టర్ కె.మాధవీలత ఆదేశించారు. బాధ్యత తో విధులు నిర్వర్తించాలని, అలసత్వం వహిస్తే సహించనని హెచ్చరించారు. కొవ్వూరు మునిసిపల్ కమిషనర్ ఈరోజు నేను వొస్తున్నానని రిజిస్టర్ లో సంతకం చెయ్యడం పై కలెక్టర్ పై విధంగా స్పందించారు. నిబద్ధతతో కూడిన పౌర సేవలు అందించడం అధికారుల భాద్యత అని స్పష్టం చేశారు. ఇకపై తరచుగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చెయ్యడం జరుగుతుందన్నారు. గ్రామ సచివాలయ నేమ్ బోర్డ్ ప్రజలకు తెలిసేలా ఉండాలని, కార్యాలయంలో ఏర్పాటు చేస్తే ఏమి ప్రయోజనం? అంటూ ప్రశ్నించారు. వెంటనే కార్యాలయం బయట పెట్టవల్సిందిగా ఆమె ఆదేశించారు. రిజిష్టర్ ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వివరాలు, లబ్దిదారుల వివరాలు ప్రముఖంగా ప్రదర్శన చేసేలా వాటి వివరాలు సచివాలయ కార్యాలయాల బయట ప్రదర్శించి, ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. అంతకుముందు విజిటర్స్ పుస్తకం లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ పర్యటన లో కలెక్టర్ వెంట తహశీల్దార్ బి.నాగరాజు నాయక్, మునిసిపల్ కమిషనర్ ఎమ్.రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News