ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన జిల్లాల నేపథ్యంలో కార్యాలయాలు ఏర్పాటు, చేరిన అధికారులు, సిబ్బంది వివరాలు పై సమగ్ర వివరాలను కోరడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిశా నిర్దేశం చేసారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి గురువారం రాత్రి స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి అధికారులు ఆబ్కారీ, గ్రామ , వార్డు సచివాలయ ల పై, స్పందన ఫిర్యాదులు , గృహ నిర్మాణం, ఓటీఎస్, తదితర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై సమీక్షించారు. అనంతరం ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆయా శాఖల ద్వారా చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలను శాఖల వారీగా జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. తొలుత నూతనంగా భాద్యతలు చేపట్టిన కలెక్టర్లను ఆయన అభినందించారు. సచివాలయ పరిధిలోని వాలంటీర్లు అభినందన వేడుకల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలు ప్రారంభించని లబ్దిదారుడు ఇంటి నిర్మాణం చేపట్టేలా, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *