వైభవంగా శ్రీ కళ్యాణ సీతారామ ఆలయ ధ్వజారోహణ మహోత్సవం

-ధ్వజస్తంభం ఉంటేనే ఏ దేవాలయానికైనా ఆలయతత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాలయాలలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో.. ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్లోని శ్రీ కళ్యాణ రామాలయం నందు నూతన విమాన శిఖర మరియు జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం వేద పండితుల మంత్రోత్చరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. మృగశిర నక్షత్రయుక్త వృషభ లగ్న ముహూర్తాన కన్నుల పండువగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో అభిషేకించి, ముస్తాబు చేసి పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏ దేవాలయానికైనా ధ్వజస్తంభం ఉంటేనే ఆలయతత్వం వస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారన్నారు. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలలో ఆధ్యాత్మికత వెల్లివిరియడంతో పాటు.. ఐక్యత పెరుగుతుందన్నారు. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయన్నారు. శ్రీ కళ్యాణ రామాలయ దేవస్థాన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఎలప్పుడూ ఉంటాయని వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తిచేసిన ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, సెక్రటరీ సుధాకర్, ట్రెజరర్ కృష్ణ, సభ్యులు ప్రభాకర్, సత్యనారాయణ, రాము, నాయకులు దేవినేని సుధాకర్, ఒగ్గు విక్కీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *