రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ భాద్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం లో తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ టి. దినేష్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, నగర ప్రజల సహకారంతో రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా తీర్చిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. నూతన జిల్లా లు ఏర్పాటు చెయ్యడం ద్వారా పరిపాలన వ్యవస్థ మరింత గా ప్రజలకు చేరువ చెయ్యడం జరిగిందన్నారు. ప్రజలకు చేరువగా డోర్ స్టెప్స్ వద్ద ప్రభుత్వ పథకాలు అందించాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే, సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని సుందర నగరంగా, గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దదానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగులో మరింత మెరుగైన ర్యాంక్ వొచ్చేలా పనిచెయ్యడం జరుగుతుందన్నారు. అందరితో కలిసి నగర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లో ప్రజల భాగస్వామ్యం తో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థఅధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కమిషనర్ కి అభినందనలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *