రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన వారందరికీ నిర్ణీత సమయంలోనే ఇంటి వద్దనే అందిస్తున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు.
శనివారం శ్రీ ఆనం కళాకేంద్రం పునర్ ప్రారంభం సందర్భంగా వాలంటీర్ ల సేవా అవార్డుల ప్రాధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యల స్థాపన కై క్షేత్ర స్థాయిలో నే సుపరిపాలన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 4 లక్షల మంది వాలంటీర్లు నియమించడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థను స్థాపించి ప్రభుత్వ ఫలాలను సకాలంలో లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పాలనలో రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఉండేదని మరల తూర్పు గోదావరి జిల్లా పేరుతో రాజమహేంద్రవరాన్ని జిల్లా కేంద్రంగా మార్చడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మన జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బొగ్గు కొరత, ఉక్రెయిన్ వంటి సమస్యలతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని రాబోయే రోజుల్లో ప్రభుత్వం విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 22 వేల కోట్లు విద్యుత్ బకాయిలు పెట్టి వెళితే మన ప్రభుత్వం చెల్లింపు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. చారిత్రాత్మక సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరం నడి ఒడ్డున గల శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం అందరి సహకారంతో పునః ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
కళాకేంద్రం నిర్వహణలో విద్యుత్ చార్జీలు అధిగ మించేందుకు భవిష్యత్తులో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి వారి ఆరోగ్య పరిస్థితి,రేషన్ అందించి మదర్ థెరిస్సా వంటి సేవలను వాలంటీర్లు అందించిన తీరు అమోఘం అన్నారు. ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు చేరువ చేయడంలో కుల మత పార్టీలకతీతంగా లబ్ధిదారులనుఎంపిక చేయడంలో
కీలక పాత్ర పోషించారన్నారు. నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపేందుకు అంకితభావంతో పని చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందు ఉంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సేవా భావంతో పనిచేస్తున్న ప్రతి వాలంటీర్ వజ్రాలేనని రాలేనని ఈ సందర్భంగా వారికి సెల్యూట్ కలెక్టర్ అన్నారు.
మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 35 శాఖలకు సంబంధించిన 500 రకాల పౌర సేవలు అందించడం జరుగుతోందన్నారు. వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలు గుర్తింపు నిచ్చి ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2.38 లక్షల మంది లబ్దిదారులకు 20 పధకాలు ద్వారా సుమారు రూ.130.29 కోట్ల మేర ఆర్ధిక ప్రయోజనం సంక్షేమ కార్యక్రమాలు ద్వారా అందచేసినట్లు తెలిపారు.
రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేర వెయ్యడం లో వాలంటీర్ సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దళారి వ్యవస్థ లేకుండా, పారదర్శకంగా ప్రజల కు నేరుగా సంక్షేమ పథకాలు అమలు లో వారధులుగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్. సూర్య ప్రకాశరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వాలంటీర్ లు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News