తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు కోత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు కోత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.

స్థానిక మునిసిపల్ కార్యాలయం లో శనివారం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ రామ్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ వినియోగదారుల కు, రైతులకు విధ్యుత్ సరఫరా లో అంతరాయము లేకుండా చర్యలు చేపట్టాము. గత 24 గంటలలో గృహ వినియోగదారులకి సరఫరా లో అంతరాయము లేదన్నారు. విధ్యుత్ అధికారులతో సమీక్షా చేసి పరిస్థితిని సాధారణ స్థితి కి తీసుకుని వచ్చాము. నిరంతరం విధ్యుత్ వాడే పరిశ్రమ లు 50 శాతం, ఇతర పరిశ్రమలు సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉ 6 వరకు విద్యుత్ వాడరాదని తెలిపామన్నారు. వారంతర సెలవు కు అదనంగా మరో రోజు సెలవు ఇవ్వాలని కొరా మన్నారు.

కలెక్టర్ వ్యవస్థను సులభతరం చెయ్యడం లో ముఖ్యమంత్రి ఆలోచన వలన ఈ రోజు విధ్యుత్ సమస్య పరిష్కారం చూపడం జరిగిందని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చొరవ తో ఫీడర్ స్థాయి వరకు సమీక్షా చేసి పరిస్థితి అదుపులో కి తీసుకోని రావడం లో కలెక్టర్ చొరవ ను అభినందించారు.
ప్రతి ఆసుపత్రి లో విధ్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా జనరేటర్ ఏర్పాటు చేసుకో వాలని సమీక్షా లో ఆదేశాలు ఇచ్చామన్నారు.

ఈ సమావేశం లో మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, ఎపిఇపిడిసిఎల్ ఎస్ ఈ.. టీవి ఎస్ ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎపిఇపిడిసిఎల్ ఎస్ ఈ.. టీవి ఎస్సైన్ మూర్తి వారి ప్రెస్ నోట్ జత చెయ్యడం జరిగింది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *