ఉప ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం స్థల పరిశీలన…

-బొమ్మూరు లో చేపడుతున్న ఎస్ ఆర్ ఎస్ సి కేంద్రం 5.42 ఎకరాల్లో ఏర్పాటు
-సబ్ కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు లతో ఎంపీ సమీక్షా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం కార్యకలాపాలు లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వద్ద ఎస్ ఆర్ ఎస్ సి (ఉప ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం) భవనం నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చెయ్యడం జరుగుతుందని స్థానిక పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, ఏపీకాస్ట్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) మెంబరు సెక్రటరీ వై. అపర్ణ లు పేర్కొన్నారు. మంగళవారం బొమ్మూరు లోని ఉప ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనులను డా. వై. అపర్ణ, డా.కె.ఏ.సాధన లు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ తో కలిసి పరిశీలించిన, అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎంపీ మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, ఉప ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు అనువుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో పధకాలను, కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. బొమ్మూరు లో నిర్మించనున్న ఎస్ ఆర్ ఎస్ సి కోసం కేటాయించిన 5.42 ఎకరాల స్థలం లోకి డ్రైనేజీ నీరు వెళ్లకుండా రక్షణ గోడను నిర్మించి, భవన నిర్మాణానికి అనువుగా పరిస్థితి ని కల్పించడం పై హామీ ఇచ్చారు. ఈ భవనం పూర్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విద్యతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం, ప్రయోగాత్మక విధానం లో భోదన సులభతరం అవుతుందని ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఈ కేంద్రంలో శిక్షణ కేంద్రంతో పాటు సందర్శన హల్, ప్లానిటోరియమ్, లైబ్రరీ, ప్రయోగ సాల, ఆడిటరియమ్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎంపీ తెలిపారు. రాజమహేంద్రవరం కి తలమానికంగా తీర్చుదిద్దుతామన్నారు.

మెంబర్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , డాక్టర్ వై. అపర్ణ మాట్లాడుతూ, పరిశోధనలు ద్వారా మనలోని విజ్ఞానానికి మరింత మెరుగులు దిద్దవొచ్చని, త్వరలోని ఈ కేంద్రం అందుబాటులోకి వొచ్చేందుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఏపీకాస్ట్ (ఏ పి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ) ఆధ్వర్యంలో ఎస్ ఆర్ ఎస్ సి కేంద్రం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మధ్య వర్తిత్వం వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యాతో పాటు విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అధ్యాపాకులకు శిక్షణ అందించడానికి ఈ కేంద్రం కేంద్ర బిందువుగా నిలుస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బొమ్మూరు లోని ఎస్ ఆర్ ఎస్ సి భవనం కోసం కేటాయించిన ప్రాంగణంలో ఏర్పడ్డ సమస్య కి పరిష్కారం చూపితే వెంటనే నిర్మాణం పూర్తి చేస్తామని తెలియ చేసిన నేపథ్యంలో పర్యటన జరిగినట్లు తెలిపారు. ఎంపీ భరత్ రామ్ కృషి వలనే ఈ కేంద్రం ఏర్పాటు జరుగుతోందని, జిల్లాలో ఒక తలమానికంగా నిలిచేలా భవన నిర్మాణం పూర్తి చేసేలా సహాయ సహకరాలు అందిస్తామన్నారు.

ఈ సమావేశం లో డైరెక్టర్ విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీకల్ మ్యూజియం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కె.ఏ.సాధన, ఆర్డివో ఏ. చైత్ర వర్షిణి, పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *