వేమూలూరు సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ శ్రీధర్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయంలో క్షేత్ర స్థాయి లో విధులు నిర్వర్తించే సిబ్బంది మ.3 నుంచి సా.5 గంటల వరకు ఖచ్చితంగా కార్యాలయంలోనే ఉండాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేసారు. శనివారం మధ్యాహ్నం కొవ్వూరు మండలం వేమూలూరు గ్రామ సచివాలయాన్ని, కొవ్వూరు లోని 18,19 వార్డ్ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్బంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పధకాలను అందచేయ్యడం లో సచివాలయ సిబ్బంది నిబద్దత తో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. కార్యాలయ పనిదినాల్లో సిబ్బంది అందరు ఖచ్చితంగా మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకు సచివాలయం లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరించినా, ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా గైరజారైన శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పంచాయతీ సెక్రటరీ అనుమతి లేకుండా అందుబాటులో లేక పోవడం పై వివరణ కోరారు. విధులకు గైర్హజరైన డేటా ఆపరేటర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవలసినదిగా ఎంపిడివో కు ఆదేశాలు జారిచేసారు. ప్రభుత్వం అందచేస్తూన్న సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు అందచేయ్యడంలో సచివాలయ సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జేసీ వెంట ఆర్డివో ఎస్. మల్లిబాబు, తహసీల్దార్ బి. నాగరాజు నాయక్, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *