-ప్రజల, శానిటేషన్ సిబ్బంది భాగస్వామ్యం తో క్లీన్ నగరంగా ఆర్ ఎమ్ సి…
– కమీషనర్ కె. దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిశుభ్రత విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు నగరపాలక సంస్థ కమీషనర్ కె దినేష్ కుమార్ అన్నారు. శనివారం స్థానిక దానవాయిపేట 5,8 వ వార్డుల్లో ఉదయం పర్యటించి శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.హాజరు పట్టీని పరిశీలించారు. సిబ్బంది సమయానికి హాజరై విధులు నిర్వర్తించాలన్నారు. ఉదయాన్నే వార్డులో ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలన్నారు. సిబ్బంది విధిగా యూనిఫామ్ తో హాజరవ్వాలన్నారు. సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది తో మాటా మంతి కలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల సిబ్బంది అందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ లు తమ పరిధిలోని శానిటేషన్ విషయం లో ఏమైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు.నగర పౌరులు కూడా తమవంతు బాధ్యత గా నిర్దేశించిన ప్రాంతాల్లో తప్ప ఎక్కడా చెత్తను వేయరాదన్నారు. కమీషనర్ వెంట ఎమ్ హెచ్ వో వినూత్న,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News